STORYMIRROR

M.V. SWAMY

Drama Tragedy

4  

M.V. SWAMY

Drama Tragedy

నగ్న దృశ్యం

నగ్న దృశ్యం

1 min
347

      విశ్వ నగ్న దృశ్యం


విశ్వ గ్రామాల జీవన రహస్యమిదిగో

సమస్తలోకం పరిచయ మిదిగో

విశేష పూజిత నాయక గణమే

అశేష రంజిత స్వార్ధపు గుణమై

ప్రపంచ శాంతికి విఘాతమౌతూ

మేకలు పోలిన ముఖములు తొడిగి

లోకం వేదిక మైకులలో సశేష

శాంతికి పునాదులేసి రహస్య ఎజెండా

ప్రారంభాలకు సమస్త ప్రజలు

మద్దతు పొంది పరోక్ష యుద్ధం సిద్ధం

కత్తులు నూరుతో సౌదాలు నిర్మిస్తున్నారు

అపూర్వ ఆలింగన విశేషమేమిటో

నగ్న దృశ్య మాలిక చూడుడు

అద్భుతప్రేమలు డోలికలో పాతర వేసిన

ప్రేతాత్మలు ఎందరో లెక్కలు చూడు

ముష్కర మూకల వెన్నెముక ఒకడు

మతముల గొడవల మర్మము ఒకడు

నిరాశ జీవుల గుండెల్లో ఆశలు

చమురులు పోసి ఆ ఇంధన కందెనతో

బండెను నడుపుకు పోతున్న విశ్వ...

నేతలు కోకొల్లలు పరికించి చూడుము

ప్రపంచ పటంపై పావురమెడితే.....

ఎక్కడ వాలక నిత్యం సురక్షిత దేశంకై

వెదుకుతూ ఎగురుతూ...వుండిపోయే

అదేమీ వింతయో వినుడు జనులారా

సమస్త లోకం పాలకులంతా అమాయక

జీవుల ఆదరణతో అఖండ విజయంనొంది

రహస్య హింసను రాజేసి ఆ మంటల

మాటుగా అధికార స్వస్థత పొందేవారే

సామాన్య జనులను ముంచేసినవారే












Rate this content
Log in

Similar telugu poem from Drama