STORYMIRROR

M.V. SWAMY

Drama

3  

M.V. SWAMY

Drama

ఓ నల్లరాతి వజ్రమా!

ఓ నల్లరాతి వజ్రమా!

1 min
406


ఓ నల్లరాయి నాణ్య శిల్పమా!


ఓ ఓర చూపుల నల్ల జాబిలీ...

నీ నీలి కనుల నీడలలో...

వేయి పడగల మ(హ)త్తు ఉన్నది!


ఓ దోర వలపుల నల్ల గులాబీ....

నీ తలపు మెరుపుల జాడతోనే...

ముళ్ళు సహితం కవితలళ్లెను!


ఓ నాజూకు నడుము నల్ల మల్లీ....

నీ వన్నె చిన్నెల వంపుల్లో కాబోలు

ఆ చూపులన్నీ చిక్కుకున్నాయి!


ఓ అందచందాల నల్ల మయూరీ...

నీ రూపురేఖల కనుల పండవే....

వేవేలమంది మనసు పందిళ్లలో!


ఓ వేడి వెన్నెల నల్ల నక్షత్రమా...

నీ తోడు నీడల హంగురంగులతో...

నీలి మబ్బులు గమ్మత్తుగా నలుపెక్కే!


ఓ నల్లంచ

ు చీరల నీలి వజ్రమా....

నీ జిలుగు వెలుగుల కాంతిలో...

సూర్యచంద్రులు చులకనైనట్లే!


ఓ చురుకు బెరుకుల నల్ల నాగిని

నీ తళుకు బెళుకులు చందనాలే చెప్పే...

నీ మదిని పొదిని అమృతాలుండునని!


                   రచన:........ఆజాద్

























Rate this content
Log in

Similar telugu poem from Drama