వెట్టి చాకిరిలో వలస భారతం!
వెట్టి చాకిరిలో వలస భారతం!
వెట్టి చాకిరిలో వలస భారతం!
………………………….
కూటికోసం కోటి తిప్పలు
ఊరు మొత్తం వలస బాటలు
మండుటెండలో ఇసుకనడిగినా….
మురికి కాల్వ నీటి నడిగినా…
మట్టి మోసే తట్ట నడిగినా…
మేదరన్నా బుట్ట నడిగినా…
మొండిగోడలో ఇటుకనడిగినా…
మరుగుదొడ్డి గొయ్య నడిగినా…
ఇనుప ఊసల కట్టనడిగినా…
ఇరుకు కొంపలు కంచె నడిగినా…
ఇరుసు కిర్రు బండినడిగినా..
మేను మేఘం చెమటధారనడిగినా …
రోజువారీ కూలీ ధనగాథలు
కుప్పలెన్నో తెప్పలెన్నో
గుట్టువిప్పి చెప్పగలవు!
ఒక్కటి కాదు రెండు కాదు
గుత్తుగుత్తులు చిత్తుకాగిత చిత్తుకథలు
ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్కటే
శ్రమ దోపిడి దళారీ వ్యవస్థలే…
ముసలి ముతక పల్లె బ్రతుకులు
ఎండమావులు వంక చూసిన
బిక్క మొహం దిగులు గుండె గతుకులు
ఎక్కడేసిన గొంగళి అక్కడన్నది
ఇక్కడే స్పష్టమౌను...కచ్చితంగా…
గూడు నొదిలిన గువ్వ మాదిరి!
వలస కూలీ రోజు రోజూ బెంగతో…
ఆత్మాభిమానం అమ్ముకొనుటే…
……………………………..
ఎం వి స్వామి