సమాధానం లేని ప్రశ్నలు?
సమాధానం లేని ప్రశ్నలు?
గుప్పెడు గుండెలోకి చప్పుడు చేయకుండా వచ్చి చేరావు
నాదైన ప్రపంచంలో నీకంటూ ఓ ప్రేత్యేక స్థానం ఏర్పరుచుకున్నావు
కనులు మూసినా తెరిచినా రెప్పల చప్పుడు నువ్వే అవుతున్నావు
మాట్లాడిన మౌనంగా ఉన్నా మనసులో భావం నువ్వే అవుతున్నావు.
నిను చేరాలని ఆరాటం చేరలేని పోరాటం మధ్య నలిగిన మనసుని అడుగు నీ మీద ప్రేమెంతో..
నువు కావాలి వద్దు అనే ఘర్షణ - సంఘర్షణ ల మధ్య పగిలిన హృదయాన్ని అడుగు నీ మీద ఆశ ఎందుకో....
మది మోయని భారం
రెప్పలు వాలని శోకం
ఊసు పోని కాలం
దగ్గర కాని రూపం
దూరం వెళ్ళని ప్రాణం..
ఎందుకు?
ఏమిటీ?
ఎలా?
అనే సమాధానం లేని ప్రశ్నలు..
శ్రీలత. కె
హృదయస్పందన