మనో విలాపం
మనో విలాపం


అనురాగం లోపించిన బంధాలు
ఆత్మీయత కొరవడిన స్నేహాలు
ఇల్లంతా ఒంటరితనపు ఆనవాళ్ళు
ఈర్ష్య అసూయల తోరణాలు
ఉరి వేయబడిన సంతోషాలు
ఊయలలూగే ఆనందాల జ్ఞాపకాలు
ఋజువులు లేని ఆలోచనలతో యుద్ధాలు
ఎదురుచూపులతో నిండిన హృదయాలు
ఏకాంతపు అలజడులు
ఐదు అంతస్తుల భవనాలు
ఒంటరితనపు సంకెళ్లు
ఓ చిన్న పలకరింపుకి నోచుకోని కరువు కాలాలు
ఔదార్యాన్ని చూపించలేని పేద హృదయాలు
అంతం చేయలేనివా ఈ శోకాలు??