STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

నిరీక్షణ- దుఃఖానికి కారణం

నిరీక్షణ- దుఃఖానికి కారణం

1 min
13


ఏవేవో ఊహలు,

ఎన్నెన్నో కోరికలు,

మనసులో ఆశయాల కదలికలు,

బందీ చేసిన కోరికల సంకెళ్లు

ఎద అంతా నిండిన ఊహల భారాలు,

నిజం కాని వేల కావా కన్నీటికి కారణాలు,

వాస్తవికతకు కలకు మధ్య భేదాలు,

అర్థం అవ్వని క్షణం కలిగించవా ఆటంకాలు,

హృదయం అంతా నిండిన అలజడులు,

అనుమానాలు కలిగించే ప్రశ్నల వర్షాలు,

కలల ప్రపంచానికై అంతర్మదనాలు,

నిరీక్షణతో అలసిపోయిన కన్నులు,

ఆశించని మలుపులు,

కోరిక చిక్కని తలపులు,

కావా చేదు అనుభవాలకు స్నేహితులు.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract