తొలిచూపుల ప్రేమ
తొలిచూపుల ప్రేమ
తెలియని అనుభూతుల సమ్మేళనం,
అణువణువునా కలిగే కలవరం,
ఆకర్షణలతో కూడిన అనురాగం,
అయ్యేను ఆనందానికి కారణం.
ఎద లోతుల్లోని భావం,
అర్థం కాని క్షణ౦.
కాదా మన ఆలోచనల పాలిట పరీక్షా కాలం.
తపనలతో నిండిన హృదయం,
మాటలకై మనసంతా నిండిన కోరికల వర్షం.
ఎప్పుడూ అవునో నిజం,
ప్రియమైన వారి రాకకై నిరీక్షణం.
వారి సమయానికై తపించే మనం,
ప్రతి పొగడ్తకు తగిలే పూలబానం.
గాల్లో తేల్చే చిరునవ్వుల వరం,
అందుకే తొలిప్రేమ మధురమైన క్షణం.

