ప్రేమంటే ఏమిటంటే..
ప్రేమంటే ఏమిటంటే..
సూటిగా మాట్లాడటం అంత సులువు కాదేమో.. కవులు కవితలను ఎంచుకున్నది అందుకేనేమో!
ఓ పగిలిన గుండె ప్రేమ గురించి చిరు నవ్వుతో చెప్పిన ఓ చిన్న పద్యం :
ప్రేమంటే ఏమిటంటే..
నా నవ్వు ఆడలేని ఒక నాటకం..
తన కళ్లు చెప్పలేని ఒక అబద్దం..
ఈ మౌనం అడగలేని ఒక ప్రశ్న..
ఈ కాలం ఇవ్వలేని ఒక సమాదానం..
నా గెలుపుకి నేను పెట్టుకున్న గమ్యం..
నా ఓటమికి నేను ఇచ్చుకున్న ఓదార్పు..
ఈ నిరీక్షకి మిగిలిన ఓ నిరాశ..
ఈ బాధకి తోడైన మరో బలం..
అది చూసి కన్నీటి వలయంలో చిక్కుకున్న చెలి కళ్లు చివరకు ఒప్పుకున్న చేదు నిజం ఇది :
నాలో ఉన్న నిన్ను తీసేదెలా.. తొలగించేదెలా..
నీలో ఉన్న నన్ను చూపేదెలా.. బ్రతికించేదెలా..
నీకై తగిలిన గాయం నిన్ను గుర్తుచేస్తుంది..
నీతో ఆగిన సమయం నీకై ఎదురుచూస్తోంది..
మార్పులా వచ్చావో .. మార్చటానికి వచ్చావో.. మరువలేని మన జ్ఞాపకాలను.. మదిని వీడమని అడగలేకున్న.. మరొక్కసారి 'మనం' అవుతామని.. మనస్సుకి చెప్పి కదులుతున్నా..!
మనస్సులకు తెలిసిన కష్టం మనుష్యులకు తెలియకుంది.. అందుకే #సూటిగా మాట్లాడండి.. కేవలం మాటలతోనే మార్గాలు మళ్ళీ ఒకటి అవుతాయి!!
కానీ..
సూటిగా మాట్లాడటం అంత సులువు కాదేమో.. కవులు కవితలను ఎంచుకున్నది అందుకేనేమో!
✍️Kalyan Manne