కలం విడిచిన కవిత!
కలం విడిచిన కవిత!


నీ ఉనికికై అదిరే గుండె ఇకపై
విరిగిపోతుందేమో..
నీ కదలికనే అనుసరించే కళ్లకు ఇకపై నిరాశ తప్పదేమో..
నీ కలకై వేచిచూసే నిదుర ఇకపై దూరమవుతుందేమో..
నీ ఆలోచనే జపమైన మది ఇకపై నివ్వెరపోతుందేమో..
గుండెను అతికించగలను..
కళ్లను అలరించగలను..
నిదురను నిలపగలను..
మదిని మందలించగలను..
కానీ.. కదలను అంటున్న ఈ కాలాన్ని కదిపేదెలా.. జీవత్సవం అయిన ఈ జీవితాన్ని బ్రతికించేదెలా.. విప్పగలమా మనం ఈ పొడుపుకథ.. చెప్పగలమా మళ్ళీ మన ప్రేమకథ?
ఉప్పెనలా ఎగసిన అలలను ఈ తీరం నిలుపుతుంటే..
ఉద్యమంలా కదిలిన కలలను ఈ భారం మలుపుతుంది..!
కలం విడిచిన కవితలను కాలం వెనక్కి నెడుతుంటే..
కాలంతో నడవలేని కధలను ఈ కలం ముందుకి నడుపుతుంది..!