ఆరనిమంట
ఆరనిమంట


కనులు మూసినా తెరచినా మరపురాదు
కన్నీరు వరదలై పారినా కరిగిపోదు
కాలం చేసినగాయమిది
మధురమైన మన ప్రేమ బంధం
మొగ్గతొడిగి విచ్చుకునే సమయమది
ఎవరికన్ను కట్టిందో విధి చిన్న చూపుచూసింది
అమ్మవౌతావని కలలుగన్ననీవు
మాటైనా చెప్పకుండా అందని తీరాలకు
మౌనంగా పయనమైతే
కడచూపుకు నోచుకోని ఈ బ్రతుకు
కాలి బూడిదైనా కబురుచేయని కిరాతకం
పసిపాప రూపంలో నవ్వుతూ నా ఎదుట నువ్వు
తనలోనే నిన్ను చూస్తూ ఈ జీవితం ఇలాగడిపేస్తూ
గుండెలో ఆరని మంటను అదిమేస్తూ..నీ నేను