మొగ్గలు
మొగ్గలు


నిన్న మొన్న అంకురించిన చిన్నిమొగ్గలు
దినదినప్రవర్ధ మానమవుతూ అందంగా
ఒక్కొక్కరేకు విచ్చుకుంటూ ముకుళిత వదనంతో
ఒక ఉషోదయానికి పరిపూర్ణ పుష్పంగా వికసిస్తాయి
చూసేవారి మనసుకి ఆహ్లాదాన్ని పంచుతూ
సుగంధాన్ని విరజిమ్ముతూ సందెవేళ దాకా
నిండుగా నవ్వుతూ జీవితాన్ని గడుపుతూ
తనను చేరవఛ్చిన తుమ్మెదలకు మధువును పంచుతూ
బ్రతుకు ఎంతకాలమన్నది కాకుండా ఎలా బ్రతికామనేలా
సందెవాలగానే తమ తనువూ చాలిస్తాయి ఈ మొగ్గలు
ప్రకృతి ఇచ్ఛే ప్రతి సందేశం మానవాళికి ఉపదేశం
చిరునవ్వుతో ప్రతివారికి ఆహ్లాదాన్ని అందిస్తూ
బ్రతికున్నంతవరకూ సంతోషంగా జీవిస్తూ
సమాజానికి ఉపయోగపడేలా బ్రతకమని
జీవిత పరమార్థం పరోపకారమని మోగ్గల్లా మనం
మనుగడ సాగిద్దాం !విశ్వమానవ శ్రేయస్సును ఆకాంక్షిద్దాం.........