STORYMIRROR

Tvs Ramakrishna Acharyulu

Romance

4  

Tvs Ramakrishna Acharyulu

Romance

ఉండిపోయా

ఉండిపోయా

1 min
471

గజల్-ఉండిపోయా

ఊయలూగే నడుముచూసీ ఊపిరాడక ఉండిపోయా

ఎగురుతున్నాకురులచూసీ మేఘమాలగ భ్రమసిపోయా

ప్రేమలోగిలి స్వాగతాలను తనివితీరా అనుభవించా

ఆశతీరక నింగినేలల వెతుకులాటల అలసిపోయా

ఆమనొస్తే వనమునంతా పులకరింతల పూలుపూయును

అందమైనా శుకపికాలా తీపితలపుల మురిసిపోయా

వానజల్లుకు మేనుతడిసీ సప్తవర్ణపు శోభనిచ్చే

కాంతిపుంజపు స్పర్శలోనే కౌగిలింతల కలిసిపోయా

కొంటెకోర్కెలు ఉండనీయక మదనతాపం పెంచుతుంటే

మేలమాడుతు ఆమెఒడిలో రాంకిబావగ కరిగిపోయా


Rate this content
Log in

Similar telugu poem from Romance