వేలంతైన( లే)డే
వేలంతైన( లే)డే
వేలంత లేనివాడు నేడు వేలంటైన్
ప్రేమంటే అర్ధం తెలియదు
అమ్మ ప్రేమలో తియ్యదనం తెలియదు
నాన్న వెచ్చని కౌగిలి విలువ తెలియదు
మూతికి మీసాలు మొలవవు
అక్క,చెల్లి ఆప్యాయతలు తెలియవు
ప్రచార డబ్బాలు మాత్రం
ఈ పేస్టుతో తోముకుంటే
దగ్గరగా రా ..దగ్గరగారా
అంటూ ముద్దులు పెట్టుకోడం
ఈ బాడీ స్ప్రే వేసుకుంటే,
ఈ అండర్ వేర్ వేసుకుంటే
మగువలు అల్లుకుపోతారనీ
నేర్పుతాయి.
ఒకప్పుడు ప్రేమనగర్ లాంటి సినిమాలు
ప్రేమ పరిపక్వత కి ఉదాహ
రణలు
కానీ నేటి సినిమాలు టీనేజ్ ప్రేమల పేరుతొ
పైశాచిక ప్రేమకు నిలువుటద్దాలు
ప్రేమ పుట్టాలి కానీ పుట్టించనవసరం లేదు
పువ్వు దానంతట అది వికసిస్తేనే సుగంధం
కానీ కలికాలం ...మొగ్గని పువ్వుని చేస్తున్నారు
కాయని కాయగానే పండిస్తున్నారు.
చివరిగా ఓ వేలం తైను లారా
అమ్మకి,నాన్నకి,ముఖ్యంగా మీ గురివులకి
మీ ప్రేమను తెలియజేయండి
చదువు అనే బహుమతిని ఇవ్వండి.
పరిపక్వత చెందండి.అప్పుడు ప్రేమించండి.
(ప్రేమ మోజులో పడి బ్రతుకులు నాశనం చేసుకుంటున్న చిరు మొగ్గలు కోసం)