త్యాగం
త్యాగం


గజల్
పురిటిలోన చిరునవ్వే చిందించే అమ్మతనం
తోడుకున్న పెరుగులోన కనిపించే కమ్మదనం
గుండెలపై తన్నుతున్న బిడ్డడంటె మైమరపే
ఒడిని చేర్చి హత్తుకొంటు అందించే వెచ్చదనం
ఎదుగుతున్న పైరుపైన రైతుకున్న ప్రేమెంతో
కన్నబిడ్డ భవితపైన ఆశించే పచ్చదనం
చేరదీయ చేతకాని బిడ్డలున్న లోకమాయె
బరువుతాను కాకుండా తపియించే ఆవదనం
చెట్టుతాను కూలిపోయి కట్టెగాను కట్టెగాల్చు
ఓరాంకీ త్యాగముంటె చిగురించే నిండుదనం