నా ప్రయాణం
నా ప్రయాణం
మనిషిని మనిషిగా గుర్తించే మనిషి కోసం నా ఈ ప్రయాణం...,
డబ్బు అనే మత్తులో మునిగి స్వార్ధపరులుగా ఎదిగిన ఈ మానవ సమాజంలో,
ఒక మనిషికి వారి భావాలకు విలువనిచ్చే నిజమైన మనిషి కోసం నా ఈ ప్రయాణం..,
బంధాలని విడిచి అనుబంధాలని మరచి ఒంటరి బ్రతుకుని కోరే ఈ అరణ్యంలో,
ప్రేమామృతాన్ని పంచి ప్రేమగా జీవించే మనుషుల కోసం నా ఈ ఒంటరి ప్రయాణం...,
మానవత్వాన్ని మరచి రాక్షసులుగా మారిన ఈ లోకంలో,
ధర్మాన్ని నిలిపి శాంతిని పంచే మనసున్న మనుషుల కోసం నా ఈ అలుపెరగని ప్రయాణం...,
వ్యసనాలకు లోనై బానిసలుగా మారి జీవితాలని అంధకారం చేసే ఈ చీకటి రాజ్యంలో,
జ్ఞాన జ్యోతులను వెలిగించే మనుషుల కోసం నా ఈ జీవన ప్రయాణం.