నాలోని నేను
నాలోని నేను


కోటి తీరాల అవతల ఉన్న ప్రియసఖి కోసం.,
కోటి ఆశలు అలల వేగంతో.,
ఎన్నో వేల కన్నీటి ధారల ప్రవాహాన్ని.,
ఎన్నో తియ్యనైన ఊసులని.,
ఎన్నో మధురానుభూతులను నింపుకున్న మనసును నీకై భద్రంగా దాచుకొని ఎదురుచూసే ఆ సమయాన.,
మనసు మూగబోయి , మౌనం దరిచేరిన ఆ క్షణాన.,
నాలోని నేను నీతో జతనై..,
నాలోని నేను నీలోని సగమై..,
నాలోని ప్రతి అణువు నీవై..,
నాలోని ప్రతి శ్వాస నీదై..,
నాలోని సగప్రాణం నీకై..,
నీతో గడపాలని చిన్ని ఆశ....!