నీ జ్ఞాపకాలు
నీ జ్ఞాపకాలు
ఆలోచనల అక్షయ పాత్ర నిండా...
నీ జ్ఞాపకాలే....
ఒద్దు అన్న పుట్టివస్తున్నాయి..
తవ్వుతున్న కొలది ఊరేస్తున్నాయి...
గడచిన కాలాన్ని మోసుకుంటూ...
గడుస్తున్న కాలనీ బరిస్తు..
రాబోయే రాకడకై....
వడి వడి గా అడుగులు వేస్తున్నాను...
కాలానికి నేను చిక్కేనో...
కాలం నన్ను చిక్కించు కుందో...
అర్ధం కాలేదు...కానీ...
అడుగు అడుగు నా అవరోదాల మొట్టికాయలు...
మలుపు మలుపు లో మూసుకున్న
దారులే...
వాగ్దానాలు ,శభదాలు ,ప్రతిజ్ఞలు.... అంటు పెద్ద పెద్ద మాటలు అల్లను...కానీ
నా బ్రతుకు సారాంశం నీవు అయి ఉండాలి అనే చిన్న ఆశతో...ఇప్పటి వరకు నా ఈ పయనం.

