STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

పసిడి ప్రేమలు

పసిడి ప్రేమలు

1 min
2


ప్రేమకావ్యంలో నాయకీ నాయకులుగా మనమే వుందాము,
ప్రణయగీతంలో 
శ్రుతి లయలు మనమే అవుదాము.

ప్రేమ పలుకులతో బడిబాటలో పయనిద్దాము,
మౌన మనసును ఆరాధనతో నింపుకుందాము,
పరిమళ వలపును 
కథలు కథలుగా చెప్పుకుందాము,
కలలతో మనసుశున్యాన్ని పూడ్చుకుందాము,
వయసు చిన్నదైనా 
ఆకాశమంత ప్రేమ మనలో దాగుందని లోకానికి చాటుదాము.

మీమనసంతా సంతోషంతో నింపుకోవడం తప్పుకాదులే,
అక్షర కోవెలలో ప్రేమాలోచన సరికాదులే,
ఊహల్లో విహరించడం కాదూ 
అక్షర వెలుగుల ప్రకాశం కూడా మీరే అవ్వాలిలే,
కనుచూపుల కలవరింతకు కళ్యాణం జరగదులే,
ఏ వయసు ముచ్చట ఆవయసులో వుంటేనే 
జీవనగతి ముచ్చటగా వుండునులే


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar telugu poem from Classics