STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

యుద్ధం

యుద్ధం

1 min
7



బాంబుల వర్షం మొదలైయ్యిందో లేదో
ఎతైన భవనాల తలులు తెగి
పడుతూ
పొగ ఆకాశమంతా చీకటిలా కమ్మేసింది.

ముక్కు పచ్చలారని బాల్యం
బిక్కు బిక్కుమంటూ
అమ్మ ఒడిలో దాకుంది.
నిద్రపట్టని అమ్మ మనసుపై
దిగులు మేఘాలు కమ్మి
వెన్నులో వణుకు రాజేసాయి.

ఆధిపత్యపు పోరులో
అహంకారపు చెదలు చేరి
సామాన్యుల ఆశలను చిదిమేసి
వెతికినా దొరకని కారణాలతో
ఊపిరి ఆపేస్తున్నారు.

వలసపక్షులు సొంత గూటికీ
ఎగరలేక రెక్కలు విరిగి
చీకటి గదుల్లో ఆశల దీపం చాటున
ఎదురుచూపులయ్యారు.

ముగింపు గీతం పాడని యుద్ధానికి
అంతిమ ఫలితం
అభాగ్యుల సమాధులపై శాంతి ఒప్పందాలు జరుపుకోవటమే కాబోలు!


Rate this content
Log in

Similar telugu poem from Classics