గోపాలుడు
గోపాలుడు
గోవులను కాయంగ గోపాలు డేడమ్మ?
దేవతలు పూజించు ధీరాత్ము డితడమ్మ!
మన్నునే భుజియించు మందమతి వాడమ్మ!
వెన్నంటి చరియించు వేలుపై నాడమ్మ!
కన్నెలను బులిపించు కామాతురుడటమ్మ!
జన్నముల రక్షించు జగదీశు డోయమ్మ!
రారాజు కాడమ్మ!రాలుగాయటనమ్మ!
వైరులను దునుమాడె వసుధకే దొరయమ్మ!
