తెనాలి రామకృష్ణ కవి
తెనాలి రామకృష్ణ కవి
వికటకవి కాదతడు విజ్ఞాన నిధియనగ
సంస్కృతాంధ్రమున భాషాపండితుండనగ
వినుతికెక్కిన యట్టి విబుధ వరుడు తెలుగున
ఘనతరంబుగ వ్రాసె కంజాక్షుని చరితము
చాటు పద్యములలో శాశ్వతముగా నిలిచి
నాటి నుండియు నేటి నవ్య కాలము దాక
ఖ్యాతితో వెల్గొందు కవికిశోరంబతడు
జాతికాదర్శమగు సజ్జనాత్ముండతడు
పాండురంగని దివ్యపథము జూపెడు కథలు
వ్రాసెనీ కవిరాజు భక్తితత్పరుడగుచు
హంపి వైభవము తెల్పి యానాటి రాజ్యముల
భోగములు కావ్యమున పొందుపరచినఘనుడు
రామకృష్ణుని వోలె వ్రాయగా కావ్యములు
ఘంటమును జేపట్టి కవులు తపియించెదరు
తెలుగు భాషకు దివ్య తేజంబు కల్గగా
తెలుగు నుడి కారమును దిద్దుకొందాములే
తెలుగు కవుల చరితలు తెలుసుకొనుచుండి
మన
కర్తవ్య పాలనము ఘనముగా చేద్దాము.//
