దేవుని పెళ్లి
దేవుని పెళ్లి
దేవుని గుడిలో పెళ్ళండి!
దీవెన లందగ రారండి!
దేవళానికి రంగులు వేద్దాం
కోవెలనంతా కడిగేద్దాం
అందంగా అరుగును కట్టేద్దాం
సుందరంగా పందిరి వేసేద్దాం
బాజా భజంత్రీలు మోగిద్దాం
తాజా పూవులు తెచ్చేద్దాం
స్వామికి దండలనల్లేద్దాం
మామిడాకులను తెచ్చేద్దాం
తోరణాల నట కట్టేద్దాం
ఊరందరినీ పిలిచేద్దాం
దండిగ వంటలు వండేద్దాం
గుండిగలన్నీ నింపేద్దాం
పసందుగ విందులు చేసేద్దాం
వసంత మంతట చల్లేద్దాం
ఊరేగింపులు చేసేద్దాం
తీరుగ దేవుని త్రిప్పేద్దాం
దేవుని భక్తిగ మ్రొక్కేద్దాం
కావగ రమ్మని పిలిచేద్దాం
ఆహా ఓహో అనుకుందాం
అందరమిళ్లకు వచ్చేద్దాం//
