వసుధకు ముప్పు
వసుధకు ముప్పు
అణ్వాయుధపు ముప్పు కవనివేడెక్కింది
ప్రళయంబు తెస్తుంది భయము పుట్టిస్తుంది
ఉగ్రవాదముఁ బెంచి యసురు తీసేస్తుంది
నిగ్రహముఁ మరపించి నిప్పులెగదోస్తుంది.
మతవాద కాంక్షతో మానవత్వము వీడి
అతివేషములు వేయ నాపదలు వచ్చునని
తెలిసికొని ముష్కరులు తెలివితో మసలగా
కలుగు సుఖసౌఖ్యములు గౌరవంబు మిగులును
బలము కన్నను మిన్న బాసటగ నిల్చుటను
విలువైన సూక్తులను వినిపింప వలెనిపుడు
మాతృభూమిని కొలిచి మమతలను పోషించి
జాతి పరువును నిల్పి జయమంచు నినదించి
శాంతికాముక దివ్య సామ్రాజ్యమున పుట్టి
ప్రాంతములు వేరుగా భాషలును భిన్నముగ
విలసిల్ల జనులెల్ల ప్రీతిగా మెలగుచూ
కలిమిలేములయందు కష్టసుఖములు పడుచు
ఐకమత్యము తోడ ఆనందమును పంచి
ప్రాకటముగా సాగు భారతీయులు ఘనులు.//
