STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
3


71.

చంపకమాల.


వనముల శైలసానువుల వల్కలముల్ ధరియించి మౌనులున్

గనులను మూసి నీ కొఱకు గట్టి తపంబులు సల్పుచుండ నీ

వనిశము వారికై నిలిచి ప్రక్కన నుందువు తోడుగన్ నినున్

గునుకును దీయకన్ గొలుతు కూరిమి జూపవె సఖ్యతన్ హరీ!//


72.

ఉత్పలమాల.


భిక్షువులై నిరంతరము పెన్నిధి వీవని శుష్కదేహులై

మోక్షముఁ గోరుచున్ మునులు భోగము వీడగఁ బ్రీతి చెందుచున్

రక్షగ వచ్చియుందువట లాలన జేయుచు తండ్రి వోలె నా

పక్షము జేరవయ్య!నిను భక్తిగ మ్రొక్కుచు కొల్చెదన్ హరీ!//




Rate this content
Log in

Similar telugu poem from Classics