భగవద్గీత
భగవద్గీత


ప౹౹
చదివానులే ఒక ఉత్తమమైనా పుస్తకం
అది మొదలు మరవలేనన్నది మస్తకం ౹2౹
చ౹౹
పదునెనిమిది యోగాలుగ ఆ భాగాలు
పదునైనా విశ్లేషణలతో ఆ పదాంగాలు ౹2౹
తత్వ చింతనలో దానిని మించేదిలేదు
కవిత్వగుణంలో దాని నెదిరించేదిలేదు ౹ప౹
చ౹౹
ప్రేరణను ప్రేమతోడ పెంపొందించునులే
ప్రేక్షకపాత్రనే కార్యోన్ముకుణ్ణీ చేయునులే ౹2౹
వ్యక్తివికాసంనే వివరంగా భోధించునులే
వ్యక్తత్వమంటే ఏమిటో నిరూపించేనులే ౹ప౹
చ౹౹
వేదాలసారం ఉపనిషత్తుల ఉపదేశమేలే
పదాలలోకూర్చి అందించిన సందేశమేలే ౹2౹
భగవంతుడే స్యయంగాను అందించినది
భగవద్గీత కన్నా ఉన్నదా ఉత్తమమైనది ౹ప౹