సుప్రభాత శుభ వేళ
సుప్రభాత శుభ వేళ
మబ్బుల మాటున భానుని దాగుడు మూతలు
మదిలో దాగిన మాటల మౌనదీక్షలు
చెప్పాలనే తపనకి సాయంరాని అక్షరజప్తులు
నిస్తేజమై పలుకుతున్న సుప్రభాత స్వాగతాలు
సెలయేటి గలగలల తరంగాలు
పూబాలల చిరునవ్వుల చిద్విలాసాలు
కోకిలమ్మ కుహుకుహూల సరాగాలు
సుప్రభాత శుభవేళ రమణీయ దృశ్యాలు..

