STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నేనంత

నేనంత

1 min
1



నీ గాన మాధురిని..పొగడగా నేనెంత..! 
ఏవేవొ మాటలతొ..అల్లగా నేనెంత..! 

గుండెతడి బ్రతికించు..నీచూపు చాలోయి.. 
నీ మహిమ రుచినింత..పంచగా నేనెంత..! 

నిదురలో మెలకువలొ..జన్మాల చెలుడవే.. 
ఈ మాయ తెఱపట్టు..పలుకగా నేనెంత..! 

దండాలు అడుగవే..దండలే కోరవే.. 
నిజపసిడి కొండవే..చూపగా నేనెంత..! 

మెఱుపులో చినుకులో..నటరాజ రాజువే.. 
నీ రూపు బొమ్మగా..చెక్కగా నేనెంత..! 

చిత్రాలు శిల్పాలు..కాలగతి చాటేను.. 
కావ్యమై పొంగగా..దూకగా నేనెంత..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics