వెన్నెల
వెన్నెల
చెలిమి మంత్రములు..నేర్పును వెన్నెల..!
కిటికీ తలుపులు..తట్టును వెన్నెల..!
పిల్లల పాపల..నవ్వుల తానే..
అమాయికముగా..పండును వెన్నెల..!
విరహపు సాక్షిగ..కురిసే మధువే..
ప్రేయసి ప్రియులను..నిలుపును వెన్నెల..!
మెట్టెల సడిలో..మరుగును మెల్లగ..
జాబిలి పాటల..వెలుగును వెన్నెల..!
మొగ్గల సిగ్గుల..నిగ్గుల నేలగ..
చినుకు పూలలో..చేరును వెన్నెల..!
కలలకు రెక్కలు..తొడిగే జాణయె..
తియ్యని నిప్పులు..పరచును వెన్నెల..!
