STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఊపిరికి ఊపిరులు

ఊపిరికి ఊపిరులు

1 min
4


ఊపిరికి ఊపిరులు..నింపుతూ ఉంటావు..!
మదిని నీ పాటగా..మలచుతూ ఉంటావు..!

నాలోని కళలన్ని..నీ రాగ మాలికలు..
ఈ నన్ను వెన్నంటి..నడుపుతూ ఉంటావు..!

నీ రుజువు చూపడం..కాదులే నావల్ల..
నీ చూపుతో నన్ను..చెక్కుతూ ఉంటావు..!

మాటలకు అందకనె..వెలిగేవు మౌనమున..
అక్షరం సాక్షిగా..దూకుతూ ఉంటావు..!

అనురాగ బంధాల..గంధాలు అంటకే..
నిజ ప్రేమ గానమై..పొంగుతూ ఉంటావు..!

సరికొత్త భావల..వెల్లువకు మూలమా..
చైతన్య శిఖరాన..చేర్చుతూ ఉంటావు..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics