నా విరహం
నా విరహం
నెమలీకల విసనకర్ర..చల్లార్చదు నా విరహం..!
ఏ మల్లెల పానుపైన..మరి మాన్పదు నా విరహం..!
తనపాటగ మారలేని..పదాలతో పనేంలేదు..
నిజచందన గంధమైన..అరె ఆర్పదు నా విరహం..!
మధురోహల చెట్టుకు నను..కట్టేసెను ప్రేమతోటి..
ఏ పున్నమి వెన్నెలైన..సరె తీర్చదు నా విరహం..!
చాటునుండి ననుచూస్తూ..నవ్వడమే వేడుకేమొ..
మంచుపూల వర్షానికి..తల వంచదు నా విరహం..!
సమరానికి సిద్ధపడిన..సుందరాంగి తానేగా..
పారిపోవు వేషమేది..తను వేయదు నా విరహం..!
అనురాగపు వీణియకే..స్వరధారగ మిగిలేనది..
మధుశాలన గాకుండా..నను చేర్చదు నా విరహం..

