మాటలతో
మాటలతో
మనసెలాగ దోచితివో..చెప్పనెలా మాటలతో..!
రగులుతున్న తీపి చితిని..చూపనెలా మాటలతో..!
విరహపుగది పరిహాసం..పానుపైన శుభ తరుణం..
నిదురరాని కనులగోడు..నిలుపనెలా మాటలతో..!
తుఫానులో కడలినడుమ..పడవైనది ఆలోచన..
విసిరేసే గాలిపాట..వ్రాయనెలా మాటలతో..!
కఠినశిలను ప్రార్థిస్తే..కరిగిపోయి కరుణించును..
నీ చెదరని సుకుమారత..చెక్కనెలా మాటలతో..!
నా గందరగోళంతో..నీ కవసర మేమిటిలే..
పట్టి కాల్చు తలపులేవొ..కాల్చనెలా మాటలతో..!
మౌనవీణ తంత్రులింట..నాట్యమాడు మనోహరీ..
మరి ఆగిన గుండె సడిని..నడపనెలా మాటలతో..!
