STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మధువెఃదుకు

మధువెఃదుకు

1 min
2


నీ చూపుల మధువుంటే..ఇంకేదో మధువెందుకు..!
నిను చూస్తూ నేనుంటే..ఇంకేదో మధువెందుకు..!

మాటలలో పొదగలేని..భావనలను వర్షిస్తూ..
కన్నులింట నీవుంటే..ఇంకేదో మధువెందుకు..!

కష్టాలకు భయపడుతూ..పారిపోవు పనేంలేదు..
నీ తలపే తోడుంటే..ఇంకేదో మధువెందుకు..!

సంయమనం పాటించే..జ్ఞానమెలా ఇస్తావో..
మౌనపు గది చదువుంటే..ఇంకేదో మధువెందుకు..!

సహనానికి సరిహద్దులు..లేవన్నది రుజువైనది..
చిరునవ్వై మనసుంటే..ఇంకేదో మధువెందుకు..!

ప్రశ్నలకిక చోటులేక..పోయేనా చిత్రముగా..
ప్రేమనిధిని కొలువుంటే..ఇంకేదో మధువెందుకు..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics