బతుకుటెలా
బతుకుటెలా
అందరితో కలిసుంటూ..నవ్వేస్తూ బతుకుటెలా..!?
ఆనందపు రహస్యాన్ని..పూసగుచ్చి చెప్పుటెలా..!?
ఎవ్వరేమి అన్నా సరె..ఎవ్వరెలా ఉన్నా సరె..
తొందరపడి స్పందించక.. మౌనంగా ఉండుటెలా..!?
తప్పులెంచు పనిమానే..ఉపాయమే ఉపాయమోయ్..
ఎవరినైన దేనికైన..శహభాషని మెచ్చుటెలా..!?
అనుక్షణం నేర్చుకునే..సరదాయే సరదానోయ్..
నీలోపలి అజ్ఞానం..ఇంకెవరో కాల్చుటెలా..!?
ఏ కత్తులు బాంబులైన..ప్రేమ ముందు దిగదుడుపే..
అహంకారమది రాలే..జ్ఞానమునే పట్టుటెలా..!?
నీ చుట్టూ నీలోపల..జరుగుతోంది నీ సినిమా..
గమనించే అసలు విద్య..మాటలలో పెట్టుటెలా..!?
