STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మల్లెపువ్వు

మల్లెపువ్వు

1 min
0


మల్లెపూల ఘుమఘుమలూ 
గులాబీల సౌరభాలు
ముదితమోహ పరవశాలు 
మదినిగెలుచు సుమశరాలు 

కన్నులు చంద్రికలే చూపున వెన్నెలలూ
నవ్వులు పువ్వులులే మోవిన గులాబీలు 
పున్నమి రాతిరంత ఉద్యాన వనమంతా
చినదాని మోమునొప్పి అలరారు చున్నవిలే 

సంపంగి ముక్కుకున్న ముక్కెరను ఔదామని
ఔదామని మందార బుగ్గలో సౌదామిని
సౌదామిని మనసులో పాగాను వేయాలని
వేయాలని మెడలోన మైమరచి మాంగల్యము 

తరుణిమాయ చేసిందీ తరుణమొచ్చి నిలిచిందీ
చెలియచెంత చేరినాను చెలిమిచేసి చాటినాను
మురిసిపోయి మనసుపడి మనువునాడ మోదమంది
తడిసిపోయి మనసంతా మయూరమై ఆడిందీ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics