STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మౌనంలో

మౌనంలో

1 min
2


అందమైన విశ్వముంది..నీ చెదరని మౌనంలో..!
ప్రతి ప్రశ్నకు జవాబుంది..నీ చెదరని మౌనంలో..!

ప్రియమైనది ఏదైనా..మాయమగుట సహజంలే..
జ్ఞానమిచ్చు దీపముంది..నీ చెదరని మౌనంలో..!

అవగాహన తోడుంటే..ఆందోళన దరిచేరదు..
బంగారపు వర్షముంది..నీ చెదరని మౌనంలో..!

కణకణమూ ప్రేమకు ఒక..ఇల్లేనని తెలిసేనోయ్..
తేటపరచు తత్వముంది..నీ చెదరని మౌనంలో..!

సహస్రగురు తీర్థమదే..సహనంతో గమనిస్తే..
శ్వాసలేలు గగనముంది..నీ చెదరని మౌనంలో..!

వినే గుణం పెంచేదుకు..తగిన బలం దొరుకునెలా..
చైతన్యపు మూలముంది..నీ చెదరని మౌనంలో..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics