STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ప్రేమ లో

ప్రేమ లో

1 min
2



ఏనాడొ పడ్డాను..నీతోటి ప్రేమలో..!
పాటనై మిగిలాను..నీతోటి ప్రేమలో..!

మనసేమొ శూన్యమై..పోయింది వింతగా..
లోకాలు చుట్టాను..నీతోటి ప్రేమలో..!

అద్దాన చూడగా..కనరాదు నా బొమ్మ..
నిను చూస్తు ఉన్నాను..నీతోటి ప్రేమలో..!

శతకోటి దీపాల..ప్రాణాల ప్రాణమా..
నన్ను నే మరిచాను..నీతోటి ప్రేమలో..!

చీకటో వెలుతురో..పనిలేదు నాకిపుడు..
నీ హృదిని చేరాను..నీతోటి ప్రేమలో..!

కాలమే మాయమై..పోవడం బాగుంది..
దూరాలు గెలిచాను..నీతోటి ప్రేమలో..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics