STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

తోడు చాలు

తోడు చాలు

1 min
7



తీపి నిప్పు రాజేసిన..మల్లెతీగ తోడు చాలు..!
కిటికీలో దూరేసిన..మల్లెతీగ తోడు చాలు..!

కోరికలను రాల్చేసే..రుతువుతోటి పనేమిటిక..
వసంతమై నిండేసిన..మల్లెతీగ తోడు చాలు..!

మోమాటం లేని ఆశ..పరుగులెంత మనోహరం..
నా నిదురను మింగేసిన..మల్లెతీగ తోడు చాలు..!

తననవ్వుల వెన్నెలలో..ఎన్ని చిలిపి రాగాలో..
నా కథనే అల్లేసిన..మల్లెతీగ తోడు చాలు..!

పలుకుతేనె లూరించే..నెఱజాణయె తానంటా..
మౌనవీణ మీటేసిన..మల్లెతీగ తోడు చాలు..!

ఏ శాపం వరమైనదొ..మనసుకేమి తెలుసంటా..
నా ఊపిరి నిలిపేసిన..మల్లెతీగ తోడు చాలు..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics