ప్రియా సఖీ
ప్రియా సఖీ
నేనంటే నీ ఇష్టం..నీ చూపులు చెబుతున్నవి..!
నా వీనులు నీ అందెల..సవ్వడినే వింటున్నవి..!
లేదు ఆశ..ఒకే ధ్యాస..నీ ప్రేమకు దాసుడనే..
నా తలపులు నీవెంటే..తెగ పరుగులు తీస్తున్నవి..!
ఓటమినే గెలుపులాగ..స్వీకరించు మనసిస్తివి..
ఆటసాక్షి నా శ్వాసలు..చిరునవ్వులు పూస్తున్నవి..!
ఎవరితోటి ఏం చెప్పను..ఉన్నదంత మాయేగా..
మౌనం విరబూస్తుంటే..మాటలేమొ అంటున్నవి..!
పదునుకత్తి అంచుపైన..నడవటమేం కష్టమటా..
గుండెగొంతు గీతంలో..శాంతిపూలు పుడుతున్నవి..!
చెలిమివనం పెంచేందుకు..తోడుంటివి అక్ష'రమా..
నీ జతలో నవసృజనకు..బీజాలే పడుతున్నవి..
