ఏం చెప్పను ఇంకా
ఏం చెప్పను ఇంకా
ప్రేమిస్తూ ఉంటానని..ఏం చెప్పను ఇంకా..!?
ప్రేమగ నే మిగిలానని..ఏం చెప్పను ఇంకా..!?
నీకెట్లా తెలుస్తుంది.. నీవునేను ఒకటని..
ప్రాణమునై ఉన్నానని..ఏం చెప్పను ఇంకా..!?
ఈ వెలుతురు ఆ చీకటి..సయ్యాటను చూడని..
నీతో నువు ఉండాలని..ఏం చెప్పను ఇంకా..!?
మౌనం నీ అసలిల్లని..నీ తోడని చేరని..
మాటలన్ని ఆగాలని..ఏం చెప్పను ఇంకా..!?
రుతువొకటే వాసంతము..నవ్వున వెలగాలని..
విశ్వాలను ఏలాలని..ఏం చెప్పను ఇంకా..!?
అజ్ఞానమె జ్ఞానానికి..దారిని వేసేనని..
నీ దుఃఖము రాలాలని..ఏం చెప్పను ఇంకా..!?
