కావాలోయ్
కావాలోయ్
ప్రతి తలపొక తిరుగులేని..సంకల్పం కావాలోయ్..!
ప్రతి అడుగున దివ్యమైన..ధీరత్వం ఉండాలోయ్..!
సాధించే దేమిలేదు..ప్రతిక్షణం సాధనయే..
పోరాటం ఏమిలేదు..సహననిధిగ మిగలాలోయ్..!
ఆవేశపు పాలన్నీ..మరిగి ఇగిరిపోవాలోయ్..
ఆనందపు పాలు వెన్న..సరిగ తెలిసి పంచాలోయ్..!
చైతన్యపు తీర్థంలా..మనసుంటే చాలంటా..
కాలం సాక్షిగ బ్రతికే..రహస్యమే పట్టాలోయ్..!
నేర్చుకునే కళ అంటే..నేను నాది వదలడమే..
పారిజాత పుష్పంలా..రాలు విద్య అందాలోయ్..!
ఓ కార్బన్ కాపీలా..పుడుతూనే ఉంటావా..
ఓ శాశ్వత వాక్యంలా..విశ్వంలో వెలగాలోయ్..!
