వెన్నెల
వెన్నెల
తారల గదులను..మూయును వెన్నెల..!
మంచుకు దుప్పటి..కప్పును వెన్నెల..!
దడదడ పుట్టగ..వణికించునులే..
దొంగకు భయమే..పెంచును వెన్నెల..!
అల్లరి పిల్లల..ఆటకు బలమే..
కథలూ కబురుల..నిండును వెన్నెల..!
గూళ్ళకు చేరని..పక్షులు ఎన్నో..
జ్వరాల పండగ..తెచ్చును వెన్నెల..!
కాలపు గుడిలో..పున్నమి దీపం..
విరహపు కడలిగ..మారును వెన్నెల..!
రుతువుల సాక్షిగ..ఎడారి లోనూ..
మౌనపు మధువుగ..జారును వెన్నెల..!
