తెలుగు తల్లీ!
తెలుగు తల్లీ!
పద్యం:
తేట తెలుగు కలలొ దేవలోక తలుపు
తేట తెలుగు యిలలొ తేనె పలుకు
తెలుగు లోని తీపి తెలియకుంటే యేల
తెలుగు భూమి తేట తెలుగు తల్లి
భావం:
ఓ తెలుగు భూమి! ఓ తెలుగు తల్లీ! తెలుగు భాష కలలో స్వర్గ లోకపు తలుపు. తెలుగు భాష నిజజీవితం లో తియ్యని తేనె వంటిది. ఇలాంటి తెలుగు లోని తీపి అందరికీ తెలియ కుంటే ఎలా?