సజ్జనుడు
సజ్జనుడు
పద్యం:
సజ్జనుడుడి మాట సన్మార్గ సూచిక
తప్పు పెరిగినపుడు తరిమి వేయు
చుక్క మెరుపు మెరువు చీకటున్నప్పుడే
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! సజ్జనుడి మాట మంచి మార్గానికి సూచిక. చీకటి ఆవరించినపుడు నక్షత్రాల వెలుగులు ఎలా ఉంటాయో సమాజం లో తప్పు పెరిగినపుడు మంచి వ్యక్తి యొక్క మాటలు కూడా అలానే ఉంటాయి.