యద్భావం తద్భవతి
యద్భావం తద్భవతి


మహిని కరుణ రసాత్మక కామ్యముల ప్రసాదించు దైవముల పూజించు భక్తుల భావంబుతోన్
సహజ సిద్ధ దత్త అనునయంబుల ఆ దైవంబుల అనుసరణలు విచిత్ర వ్యక్తీకరణంబులన్
అహంభావమున్ విడనాడే నిమిత్తoబున నా మనంబున మెదిలే ఈ స్మరణలన్ ఉత్తే జములతోన్
మీ మనోహర నేత్రముల ఎదుట నేనుంచెద నా భావంబులన్ మీ ఆచరణకు తోడుగాన్ . !!
శివ పుత్రులతో నిత్యమూ భక్తి భావమ్ము గఱపఁ, శివపుత్రికలన్ అనుక్షణము స్మరియించు చుంటిమి న్
భవ సమ్మిళితముతో ప్రథమముగా మన డెందములందునన్ నిత్యం ఆ అశోక సుందరిని తలచెదము
రవి కిరణములన్ బ్రోలు , తిమిర సమరముజేయు ఆ దీప జ్యోతిన్ ప్రతీ ఉష: కాలమునన్ వెలిగించి మ్రొక్కెదము,
తవ అజ్ఞాన తిమిరములన్(బాపు, యోగమాయతోన్ నాగమాతఁ కుణ్డలీని ప్రేరణమీరన్ మానసాదేవిన్ తలచు చుంటిమిక్కడన్ !!
పూజలన్ సలుప( ప్రకృతి దైవ సన్నిధిం గల యా జగజ్జననిన్ దలువ నా భావంబీ రీతిగా నాకుంఇటులన్ దోచెన్
ఆ జలజాక్షి పూజింపఁ మురారికిన్ పూజచేసినట్లు కాదె , ఆతని హృదయబునం నామే , కృష్ణప్రియ హృదయంబులో చక్రి ,
సుజల జ్ఞాన ధారలన్ ప్రవహింపజేయు వాగ్దేవి పూజించినన్ ఆ సృష్టి కర్తయగు ఆ పరబ్రహ్మన్ పూజించినట్లగున్ కదా ,
రాజరాజేశ్వరికిఁ కైమోడ్పులన్ దాల్చగాన్ ఆ నీలకంఠున్ పూజించినట్లుగాఁదే ఆ అర్ధనారీశ్వరున్ కృపాకటాక్షములం పొందఁగాఁ !!
గగనమండలంబునందు వెలుగొందు బాలాదిత్యుండు బ్రహ్మ విష్ణు శివాత్మికమగు దత్త రూపంబునం వెలుగొందు న్
అగణిత గుణ గణంబులతోన్ సకలజీవులకున్ దత్తం బునొనగూరెడు శక్తి, భుక్తి, ముక్తి దాతయున్ ఒప్పునా మార్తాన్డున్
జగమునన్ జీవ రాశికి మేలుకొఱకున్ ఆదిత్య హృదయ స్తోత్రమున్ పఠించి, సూర్య నమస్కారములం జేసి సూర్యారాధనం మిగులన్ఒ
ప్పుగ కాల గమనున( దినకరుండు చేసేది మేలును మరువన్ గలమే కృతజ్ఞతారాధ్యములం జూపెడి భక్తులన్ గాంచెడు దయార్ద్ర హృదయుడున్