సజ్జనుడు
సజ్జనుడు
పద్యం:
సజ్జనుడుడి మాట సన్మార్గ సూచిక
తప్పు పెరిగినపుడు తరిమి వేయు
చుక్క మెరుపు మెరువు చీకటున్నప్పుడే
పలుకులమ్మ దివ్య భారతాంబ
భావం:
తల్లీ భారతీ! సజ్జనుడు మాట్లాడే మాటలు మంచి మార్గానికి సూచికలు. చీకటి ఆవరించినపుడు, చీకటిని నక్షత్రాలు తరిమి వేసినట్టు, సమాజం లో తప్పులు పెరిగినపుడు సజ్జనుడు తన మాటల ద్వారా తప్పును తరిమి వేస్తాడు. ఇక్కడ సజ్జనుడిని మెరిసే చుక్కలతో పోల్చడం జరిగింది.
