హరిత వనం... నీల వర్ణం
హరిత వనం... నీల వర్ణం
నీల కంఠుని ఆభరణమై నిలిచింది హలాహలం
నీలి గంటలతోరణమై చిగురించింది హాలా వనం
ధరణి అల్లుడి దోసిట తలంబ్రాలు
పుడమి తోటలొ విరులుగా వ్రాలు
నీలి నింగి రంగుని దోచింది
నేల నీలి సంద్రమై పూసింది
హరిత వనం నేడు తొడిగింది ఇంద్రనీల వర్ణం