కరోనా మహిమ...
కరోనా మహిమ...
1 min
37
నాడు కాలంతొ పరుగుతీసిన కాళ్ళు...
నేడు ఆచితూచి అడుగులేస్తున్నాయి
నాడు హోరుగాలితొ మారుమోగిన చెవి...
నేడు పలకరింపులతొ పులకరించినది
నాడు మర్యాదకు మాత్రమే కలిసే చేతులు...
నేడు తరచు కలుస్తూ తడుస్తున్నాయి
నాడు మొబైలులొ మునిగిన కళ్ళు...
నేడు అలసిపొయి అవతల చూసాయి
నాడు కాసులతొ పండిన నోరు...
నేడు తోటివారి ప్రేమతో నిండుతోంది
ఇది కాలం మహిమా?
కాదు, కరోనా మహిమ.