చిగురించిన వెన్నెల
చిగురించిన వెన్నెల
పాలమొగ్గలు పుష్పించిన కొమ్మా...
మంచుపూవులు విరబూసిన రెమ్మా...
వెన్నెల చినుకుకు చిగురించిన చిత్రమా...
రత్నములు పొదిగిన శ్వేత హారామా...
పున్నమి చంద్రుని వన్నెల విరులా...
వెన్న పూసలతొ నిండిన కురుల...
కొలను వీడి కొలువుతీరిన తెల్లకలువల వృక్షమా ...
క్షీరసాగర మధనమే నీకు కూడా జననమా ...