STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

చీకటి తో

చీకటి తో

1 min
2



గదిని వదిలి వెళ్ళవద్దని..చెప్పనెలా చీకటితో..!
నిదురపూలు చల్లవద్దని..చెప్పనెలా చీకటితో..!

ఎదలోయల కురుస్తున్న..అగ్గివాన బాగున్నది..
ఆ వర్షం ఆపవద్దని..చెప్పనెలా చీకటితో..!

ఏదోలా కవ్విస్తూ..కలను చేరు పనేమిటో..
గుండెపట్టి పిండవద్దని..చెప్పనెలా చీకటితో..! 

తారావళి మాయమైన..గగనంలా మనసైనది..
దీపావళి జరపవద్దని..చెప్పనెలా చీకటితో..!

వరదనీటి భీభత్సం..పండుగెలా అవుతుందో..
నేల ఉనికి చెరపవద్దని..చెప్పనెలా చీకటితో..!

హంసలేఖ చదవలేని..చదువులతో ఏం లాభం..
జాబిలితో చేరవద్దని..చెప్పనెలా చీకటితో..!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics