ఎలా?
ఎలా?


పద్యం:
చదువు యేల వచ్చు సాధన జేయక
విద్య యేల వచ్చు వివరిణుడికి
నిండు కడుపు తోన విందు భోజనమేల
పలుకులమ్మ దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! సాధన చేయకపోతే చదువు ఎలా వస్తుంది? (రాదు అని అర్థం) అన్నీ నాకే తెలుసు అనే మూర్ఖుడి కి విద్య ఎలా అబ్బుతుంది?(అబ్బదు అని అర్థం) నిండు గా ఉన్న కడుపుతో విందు భోజనం ఎలా చేయాలి?(చేయలేము అని అర్థం).